ఆర్‌టీసీ బస్సులే రైతు బజార్లు..

Update: 2020-04-04 18:52 GMT

లాక్‌డౌన్‌ని పక్కాగా అమలు చేయాలంటే ప్రజలను ఏ అవసరానికి రోడ్లమీదకు రానివ్వకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ప్రజల చెంతకే కూరగాయలు తీసుకువెళ్లేందుకు వైసీపీ సర్కారు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న సిటీ బస్సులను మొబైల్ రైతుబజార్లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానం ఇప్పటికే విజయవాడలో అమలు పరిచి సక్సెస్ అయ్యారు. దాంతో విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. కాగా, తాము పంటించిన పంటను అమ్ముకోదలచిన రైతులకు అధికారులు అనుమతి పత్రాలు, పాస్‌లు అందజేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. పూలు, పండ్లు, కూరగాయలు ఇలా ఏవి అమ్ముకోవాలన్నా అధికారులే తోటల వద్దకు వెళ్లి ఆయా రైతులకు పాస్‌లు ఇస్తారని వివరించారు.

Similar News