AP : మోదీ ఏపీ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే

Update: 2024-05-02 05:45 GMT

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ను ఏపీ బీజేపీ విడుదల చేసింది. మే 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆయన పాల్గొననున్నారు. 7న సా.4 గంటలకు రాజమహేంద్రవరం వేమగిరిలో బహిరంగ సభలో, అదేరోజు సా.6 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు.

అనంతరం 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి రావాలని భావించారు. బిజీ షెడ్యూల్ కారణంగా మార్పులు, చేర్పులు జరిగాయని చెబుతున్నారు.

ఇకఏపీలో పోలింగ్‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఓ వైపు అధికార వైఎస్సార్‌సీపీ మరోవైపు ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు కాంగ్రెస్ కూడా జనాల్లోకి వెళుతున్నారు. మేనిఫెస్టోలు కూడా విడుదల కావడంతో.. ఆ హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.

మరోవైపు ప్రధాని మోదీ ఈనెల 13న వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించనున్నారు. మరోవైపు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News