Netflix : ఇండియాలోనూ దూసుకుపోతోన్న నెట్ ఫ్లిక్స్!

Update: 2024-05-02 05:50 GMT

అంతర్జాతీయ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇండియాలోనూ దూసుకుపోతోంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించే సినిమా ఎంటర్టైన్ మెంట్ లో నెట్ ఫ్లిక్స్ టాప్ లో ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం కోట్ల రూపాయిలు పెట్టు బడులు పెడుతోంది. ఇతర స్ట్రీమింగ్ చానల్స్ తో పోటీ పడుతూ వారికంటే ఎక్కువ ధరని నిర్మాతలకి ఆఫర్ చేస్తూ డిజిటల్ హక్కులు దక్కించుకుంటోంది. టాలీవుడ్ లో టైర్ 1, టైర్ 2 ఫ్లిక్స్ చేతికి వెళ్తున్నాయి. ఈ ఏడాదిలో రిలీజ్ కాబోయే సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మార్కెట్ లో ఆయా సినిమాలకి ఉన్న డిమాండ్ బట్టి నెట్ ఫ్లిక్స్ రైట్స్ కోసం పెట్టుబడి లు పెడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, ది రూల్ సినిమా డిజిటల్ రైట్స్ ని 275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇండియా బాక్సాఫీస్ పై ఇప్పటి వరకు ఇదే అత్య ధిక డిజిటల్ రైట్స్ డీల్ కావడం విశేషం. పుష్ప ది రూల్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టి నట్లు టాక్ వినిపిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర డిజిటల్ రైట్స్ ని ఏకంగా 155 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి పెట్టిన పెట్టుబడిలో సగం డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద డిజిటల్ డీల్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 16 కోట్లకి ఈ మూవీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్.

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ డిజిటల్ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధర ఆఫర్ చేసి సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే కచ్చితమైన ధర ఎంతనేది తెలియలేదు. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి 40 కోట్లు నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిందని సమాచారం. ఏది ఏమైనా ఇండియా ఎంటర్ టైన్మెంట్ రంగంపై దృష్టి పెట్టిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు మార్కెట్ ను అల్లకల్లోలం చేసేస్తోంది.

Tags:    

Similar News