కరోనా కట్టడికి మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నటులు రెబల్‌స్టార్ కృష్ణంరాజు ముందుకొచ్చారు.. కరోనా నివారణ చర్యలకు తమ వంతు సాయంగా కృష్ణంరాజు కుటుంబం పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం కృష్ణం రాజు మాట్లాడుతూ.. ‘ ఈ విపత్కర పరిస్థితులను అధిగమించడానికి డాక్టర్లు,
నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా, వారు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుంచి మా ముగ్గరు కూతుళ్లు దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు. అంతేకాదు అలాగే నా సతీమణి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పారు.. మొత్తం 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు కృష్ణంరాజు చెప్పారు.