ఒడిశాలో 'కరోనావైరస్' తొలి మరణం

Update: 2020-04-07 16:41 GMT

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో సోమవారం ఓ వ్యక్తి మరణించారు.. అయితే ఆయన రక్తనమూనాలను పరీక్షకు పంపగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఒడిశాలో కరోనా వైరస్ తొలి మరణం నమోదైనట్టుంది. ఒడిశా రాష్ట్రం జార్పాడకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి దీర్ఘకాలిక రక్తపోటు చరిత్ర కలిగి ఉన్నారు.. ఈ క్రమంలో విపరీతమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు.దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఏప్రిల్ 4 న భువనేశ్వర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. అయితే అతని ఆరోగ్యంవిషమించింది.

దాంతో సోమవారం మృతిచెందారు. అయితే ఇలా ఆసుపత్రులలో చనిపోయిన వ్యక్తుల రక్తనమూనాలను పంపించి టెస్ట్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి కూడా మంగళావారం పరీక్ష నిర్వహించగా కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. మరోవైపు ఒడిశాలో కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు కంటైనర్ ప్రారంభించబడిందని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఒడిశా తన నమూనా పరీక్ష సామర్థ్యాన్ని రోజుకు 300 నమూనాల నుండి వచ్చే ఐదు రోజుల్లో 1000 నమూనాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News