మంగళవారం 'కరోనా' కారణంగా 6గురు మృతి

Update: 2020-04-07 21:23 GMT

భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో మంగళవారం 6 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలోని పూణేలో ముగ్గురు మరణించారు. ఆరోగ్య శాఖ ప్రకారం, అందరూ 60 ఏళ్లు పైబడిన వారు. కిడ్నీ, అధిక రక్తపోటు వంటి ఇతర వ్యాధులు కూడా

వారికి ఉన్నాయి. దీంతో పూణేలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. అదే సమయంలో, మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 55 కి చేరుకుంది. సోమవారం రాష్ట్రంలో 7 మంది రోగులు మరణించారు.

ఒడిశా: రాష్ట్రంలో 72 ఏళ్ల వ్యక్తి మరణించాడు. గత మూడు రోజులుగా భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో చేరాడు. అయితే అతను మరణించాక జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.

మధ్యప్రదేశ్: ఉజ్జయినికు చెందిన ఒక మహిళ రెండు రోజుల క్రితం మరణించింది. ఈ రోజు ఆమెకు కూడా వైరస్ పాజిటివ్ అని వచ్చింది.. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మరణాలు సంభవించాయి.

జమ్మూ కాశ్మీర్: కరోనా సోకిన వ్యక్తి మంగళవారం మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు రోగులు మరణించారు.

Similar News