నెలాఖరు వరకు లాక్‌డౌన్..

Update: 2020-04-08 18:59 GMT

భారత ఆర్థిక కేంద్రమైన ముంబై నగరంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటూ లాక్డౌన్ ఒక్కటే పరిష్కారంగా తోస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. కానీ 20 మిలయన్లకు పైగా జనాభా ఉన్న ముంబై నగరం వైరస్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో 782 కరోనా కేసులు నమోదయ్యాయి. 50 వరకు మరణాల సంఖ్య నమోదయ్యిందని తాజా హెల్త్ బులెటిన్ వివరాలు అందించింది. ముంబైలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 100 కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితిలో లాక్డౌన్ గడువు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Similar News