ఈశాన్యం రాష్ట్రాల్లో తొలి కరోనా మరణం నమోదైంది, అస్సాంలో 65 ఏళ్ల వ్యక్తి కోవిడ్-19 కారణంగా మరణించారు. మృతుడు హైలాకాండి జిల్లాకు ఫైజుల్ హక్ బార్బ్యాన్ (65)గా గుర్తించారు. ఆయనకు
ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఎస్‌ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని ఆరోగ్యం విషమించి మరణించినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి.. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.
మరోవైపు లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగుతాయని హిమంత బిశ్వాస్ శర్మ గతంలో తెలిపిన తెలిపారు.. తమ రాష్ట్రంలోకి ఇతరులు రావడానికి పర్మిట్ వ్యవస్ధను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. కాగా అస్సాం రాష్ట్రంలో ఇప్పటివరకు 28 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారే ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.