విజయ్ మాల్యాకు భారీ ఊరట

Update: 2020-04-10 14:26 GMT

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను దివాలాకోరుగా ప్రకటించాలంటూ భారత బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ కోర్టు కొట్టివేసింది. భారత సుప్రీంకోర్టులో, కర్నాటక హైకోర్టులో అతనికి సంబందించిన కేసులు తేలేవరకు మాల్యాకు సమయం ఇవ్వాలని లండన్ హై కోర్ట్ తెలిపింది. బ్యాంకు రుణాలు పూర్తిగా చెల్లించే సమయాన్నీ ఆయనుకు ఇవ్వాలని.. ఆలా కాకుండ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని జస్టిస్ బ్రిగ్స్ స్పష్టం చేశారు. కాగా మాల్యా 114.5 కోట్ల పౌండ్ల రుణాలు ఎగ్గొట్టారనీ.. ఈ బకాయిలను వసూలు చేసుకునేందుకు వీలుగా ఆయనను దివాలాకోరుగా ప్రకటించాలని ఎస్‌బీఐ సారధ్యంలోని భారత బ్యాంకుల కన్సార్షియం అభ్యర్థించింది.

Similar News