ముంబైలో కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా వ్యాప్తి చేందుతోంది. తాజాగా భాటియా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి . భాటియా హాస్పిటల్ కి చెందిన 25 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో వారిని ఐసీయూకు తరలించారు. అయితే సిబ్బందికి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హాస్పిటల్ లో రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించామని భాటియా ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు.