కరోనాతో ప్రపంచం అతలకుతలం అవుతుంటే.. మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ ఆ ఫ్రికా దేశాలను భయపెడుతోంది. ఎబోలా వ్యాప్తి తగ్గిందన్న సమయంలో మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. అక్కడ ఎబోలా కేసులు నమోదు కావడంతో జనం వణికిపోతున్నారు. 2018 సంవత్సరం కాంగోలో ఎబోలా వైరస్ కారణంగా 2276 మంది ప్రాణాలు కోల్పోయారు.