కరోనా వైరస్ బారిన పడ్డ ఓ పోలీస్ అధికారితో మాటామంతి తరువాత మహారాష్ట్ర హౌసింగ్ మంత్రి జితేంద్ర అవద్ సోమవారం తనను తాను నిర్బంధించుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కోసం జరిపిన తొలి పరీక్షలో నెగెటివ్ వచ్చినా.. ముందు జాగ్రత్త చర్యగా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు జితేంద్ర ప్రకటించారు. ఈ మేరకు 'నాతోపాటు ప్రయాణించే పోలీస్ అధికారి ఒకరు కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నాను.. తదుపరి పరీక్షల్లో నెగెటివ్ వస్తే మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతా' అని జితేంద్ర పేర్కొన్నారు. దాంతో తనను తాను నిర్బంధించుకున్న మొదటి రాష్ట్ర మంత్రి ఆయనే అయ్యారు. కాగా అవ్హాద్ థానే జిల్లాలోని కల్వా-ముంబ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడ గత రెండు వారాలలో అనేక కరోనావైరస్ కేసులు కనుగొనబడ్డాయి.