అమెరికాను కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెనుగుతోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం ఏప్రిల్ 17 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య 667,800 కి చేరుకుంది. అంతేకాదు మరణాల సంఖ్య గురువారం 32,917 కు చేరుకుంది. గత 24 గంటల్లో 4,491 మంది మరణించారు, ఇప్పటివరకు ఇదే అత్యధిక రోజువారీ సంఖ్య. అత్యధిక మరణాలతో అమెరికా మొదటిస్థానంలో ఉండగా.. ఆ తరువాత ఇటలీ, స్పెయిన్ , ఫ్రాన్స్ ఉన్నాయి. ఇటలీలో 22,170 మంది మరణించారు, స్పెయిన్‌లో 19,130 మంది మరణించగా, ఫ్రాన్స్‌లో 17,920 మంది మరణించారు.