వరి పొలంలో భారీ మొసలి ప్రత్యక్షం అయింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు పొలం నుంచి పరుగులు తీశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. తిరుమలగిరి సాగర్ మండలంలోని నేతాపురం గ్రామంలో ఓ రైతు వరి పొలంలో కూలీలు వరి కోస్తున్నారు. వరి కోసే క్రమంలో కూలీలకు ఒక్కసారిగా పొలంలో మొసలి కనిపించింది. దీంతో షాకైనా కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో వదిలారు.