భారత్ లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఆగడం లేదు ప్రస్తుతం కరోనా కేసులు 15.722 చేరుకున్నాయి. మరణాల సంఖ్య కూడా 521 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు వ్యాధి భారిన పడి ఇప్పటివరకు 2 వేల మందికి పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. శనివారం 1370 కరోనావైరస్ కేసులు నమోదైతే.
ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 328, గుజరాత్‌లో 277, ఢిల్లీలో 186, ఉత్తరప్రదేశ్‌లో 125, రాజస్థాన్‌లో 122 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ అత్యధికంగా 3648 కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 423 మంది శనివారం కోలుకున్నారు. అయితే అంతకుముందు రోజు కూడా 304 మంది రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వడం ఊరట కలిగించే విషయం.