దక్షిణాఫ్రికాలో ఆహరం సంక్షోభం ఏర్పడింది.. దీనికి కారణం గత కొన్ని రోజులుగా విధించిన లాక్ డౌన్ అనే తెలుస్తోంది. కరోనోవైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా దేశవ్యాప్తంగా ఐదు వారాల లాక్డౌన్ విధించారు.. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఆహార సంక్షోభం ఎక్కువైంది . రోజు కూలీలు ఆకలికి అలమటిస్తున్నారు. కొంతమంది స్వచ్చంధ సేవకులు వీరి పరిస్థితిని చూడలేక ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆహరం కోసం గొడవలు జరిగాయి. ఆహార సంక్షోభంపై ప్రజాసంఘాల నాయకుడు జానీ ఫ్రెడరిక్స్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. తామంతా ఆహార సంక్షోభంలో ఉన్నామని.. ప్రజలు ఆహార పదార్ధాల కోసం దుకాణాలకు క్యూలు కట్టారని అన్నారు. మార్చి 27 నుండి సౌత్ ఆఫ్రికాలోని కొందరు పేదలు ఆకలితో అలమటిస్తున్నారని.. సరుకులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారని ఆయన అన్నారు.