రంజాన్ జరుపుకునే వారికి డబ్ల్యూహెచ్‌ఓ సూచనలు

Update: 2020-04-19 18:58 GMT

రంజాన్ పండగను జరుపుకునే వారికి పంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది రంజాన్ పండగ విషయంలో అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.

సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉంచాలని.. భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. అవసరమైతే సాంకేతికతను ఉపయోగించుకోవాలని.. ఇంటర్నెట్, రేడియో, టీవీల్లాంటి మాధ్యమాల ద్వారా ప్రార్థనలు జరుపుకుంటే ప్రమాదం ఉండదని సూచించింది.

ఇక కరోనా బాధితులు రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండొచ్చా.. లేదా.. అని వైద్య నిపుణులను అడిగి.. వారి సూచనలు పాటించాలని కోరింది. కరోనా అనుమానితులు, బాధితులు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని తెలిపింది.

Similar News