భారత్ లో కరోనావైరస్ తాజా వివరాలు

Update: 2020-04-21 08:21 GMT

భారత్ లో కరోనావైరస్ కారణంగా 550 మందికి పైగా మరణించారు, అలాగే దేశంలో సంక్రమణ కేసులు మొత్తం 17,000 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలోని కోవిడ్ -19 మరణాల సంఖ్య గత 24 గంటల్లో 40 మరణాలతో 559 కు చేరుకుంది, ఈ 24 గంటల్లో కొత్తగా 1,540 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 17,656 గా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసులలో 14,255 క్రియాశీల కేసులు ఉండగా, 2,841 మందికి నయమైంది. భారతదేశంలో అత్యధికంగా ధృవీకరించబడిన కేసులు మహారాష్ట్ర (4,203), తరువాత ఢిల్లీ (2,003), గుజరాత్ (1,851), మధ్యప్రదేశ్ (1,485), తమిళనాడు (1,477) ఉన్నాయి. రాజస్థాన్‌లో 1,478, ఉత్తర ప్రదేశ్‌లో 1,176 కు పెరిగింది. తెలంగాణలో 873, ఆంధ్రప్రదేశ్ 722, కేరళ 402 కేసులు ఉన్నాయి.

కర్ణాటకలో 395, జమ్మూ కాశ్మీర్‌లో 350, పశ్చిమ బెంగాల్‌లో 339, హర్యానాలో 233, పంజాబ్‌లో 219 కేసులకు పెరిగింది. బీహార్‌లో 96 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఒడిశాలో 68 కేసులు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో నలభై నాలుగు మందికి, హిమాచల్ ప్రదేశ్‌లో 39 కేసులు ఉన్నాయి. ఛత్తీస్‌గడ్ లో 36, అస్సాంలో 35 కేసులు ఉన్నాయి. చండీగర్ లో 26 , లడఖ్ 18 కేసులు, అండమాన్ నికోబార్ దీవుల నుండి 15 కేసులు నమోదయ్యాయి. మేఘాలయలో 11 కేసులు నమోదయ్యాయి, గోవా మరియు పుదుచ్చేరిలో ఏడుగురు కోవిడ్ -19 రోగులు ఉన్నారు. మణిపూర్, త్రిపురాల్లో రెండు కేసులు ఉండగా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కో కేసు నమోదైంది.

Similar News