ప్రపంచ దేశాలను దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఇక ఇటు ఇండియానికి కూడా వణికిస్తోన్న ప్రాణంతకర కరోనా మహమ్మారి ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సెంట్రల్ జైలుకి పాకేసింది. జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలకు కరోనా సోకిందని జైలు అధికారులు వెల్లడించారు. ఆరుగురు ఖైదీలకు కరోనా సోకడంతో వారందరినీ హాస్పిటల్ కి తరలించారు. జైలులో కరోనా ప్రబలడంతో ముందుజాగ్రత్తగా 250 మంది ఖైదీలను తాత్కాలికంగా ఇతర జైళ్లకు తరలించారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,552కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోయారు.