కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 49 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వీరిలో 11 మంది పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. మరో 38 మంది పోలీస్ కానిస్టేబుళ్లకి కూడా కరోనా పాజిటివ్ గా తేలిందని మహారాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలు దాటింది.