DELHI BLAST: ఢిల్లీ పేలుళ్ల వెనుక 15 మంది డాక్టర్లు..!

పోలీసుల అదుపులో డాక్టర్ ప్రియాంక శర్మ.. మరో 15 మంది డాక్టర్ల పై కొనసాగుతున్న గాలింపు

Update: 2025-11-17 08:30 GMT

ఢి­ల్లీ­లో­ని ఎర్ర­కోట సమీ­పం­లో జరి­గిన కారు పే­లు­డు కే­సు­లో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది.  కేసు దర్యా­ప్తు చే­స్తు­న్న నే­ష­న­ల్ ఇన్వె­స్టి­గే­ష­న్ ఏజె­న్సీ సూ­సై­డ్ బాం­బ­ర్ డా­క్ట­ర్ ఉమర్ ము­ఖ్య అను­చ­రు­డు అమీ­ర్ రషీ­ద్ అలీ­ని ఢి­ల్లీ­లో అరె­స్టు చే­సిం­ది. ఢి­ల్లీ­లో జరి­గిన ఆత్మా­హు­తి దా­డి­లో ఉప­యో­గిం­చిన కారు i-20 అమీ­ర్ రషీ­ద్ పే­రి­టే రి­జి­స్ట్రే­ష­న్ అయిం­ద­ని ఎన్ఐఏ వి­చా­ర­ణ­లో తే­లిం­ది. దాం­తో ఎన్ఐఏ ఐ20 కారు ఓనర్ అమీ­ర్ రషీ­ద్‌­ను అరె­స్ట్ చేసి వి­చా­రణ చే­ప­ట్టిం­ది. ఎర్ర­కోట పే­లు­ళ్ల తర్వాత భద్ర­తా బల­గా­లు దేశ వ్య­తి­రేక శక్తుల కోసం ము­మ్మ­రం­గా గా­లిం­పు చర్య­లు చే­ప­డు­తు­న్నా­యి. ము­ఖ్యం­గా వై­ట్‌ కా­ల­ర్‌ టె­ర్ర­రి­జం­పై­నే దృ­ష్టి సా­రిం­చా­యి. జమ్మూ కా­శ్మీ­ర్‌­లో­ని ఓ ప్ర­భు­త్వ ఆస్ప­త్రి­లో పని చే­స్తు­న్న హర్యా­నా­కు చెం­దిన వై­ద్యు­రా­లు ప్రి­యాంక శర్మ­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్న­ట్లు అక్క­డి పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు. జైషే మహ్మ­ద్, అన్సా­ర్‌ గజ్‌­వ­త్‌ ఉల్‌ హిం­ద్‌ అనే ఉగ్ర­సం­స్థ­ల­తో సం­బం­ధ­ము­న్న అదీ­ల్‌ అహ్మ­ద్, ము­జ­మ్మి­ల్‌ షకీ­ల్, షా­హి­న్‌ అనే ము­గ్గు­రు డా­క్ట­ర్లు­ను ఇప్ప­టి­కే అరె­స్ట్‌ చే­శా­రు. జమ్ము­కా­శ్మీ­ర్ అనం­త్‌­నా­గ్‌­లో ప్రి­యాంక ఉం­టు­న్న హా­స్ట­ల్ పై దాడి చేసి.. ఆమె­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్న­ట్లు పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు. ఆమె మొ­బై­ల్ ఫోన్, సిమ్ కా­ర్డు­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్న పో­లీ­సు­లు ఫో­రె­న్సి­క్ పరీ­క్ష­ల­కు పం­పా­రు.

కశ్మీర్‌ వైద్యులపై నిఘా

మొ­బై­ల్, సిమ్ కా­ర్డు ద్వా­రా మరింత సమా­చా­రం తె­లి­సే అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. దా­దా­పు 200 మంది కా­శ్మీ­ర్‌ వై­ద్యు­ల­పైన దే­శ­వ్యా­ప్తం­గా ప్ర­ముఖ నగ­రా­ల్లో­ని కా­లే­జీ­లు, వి­శ్వ­వి­ద్యా­ల­యా­ల్లో చదు­వు­న్న కశ్మీ­ర్‌ వి­ద్యా­ర్థు­ల­పై­నా నిఘా పె­ట్టి­న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. మరో­వై­పు ఢి­ల్లీ­లో పే­లు­డు­కు కా­ర­ణ­మైన ఐ20 కారు నడి­పిన వ్య­క్తి­ని డా­క్ట­ర్ ఉమ­ర్‌ నబీ అని భద్ర­తా ఏజె­న్సీ సం­స్థ­లు గు­ర్తిం­చా­యి. అలా­నే అత­డి­తో సం­బం­ధ­ము­న్న మరో ఐదు­గు­రు వై­ద్యు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. వా­రం­ద­రి­కీ ఉగ్ర సం­స్థ­ల­తో సం­బం­ధా­లు ఉన్న­ట్లు వి­చా­ర­ణ­లో తే­లిం­ది. దీం­తో వా­రి­తో కలి­సి చదు­వు­కు­న్న, పని చే­స్తు­న్న ఇతర వై­ద్యు­ల­పై­నా అధి­కా­రు­లు నిఘా పె­ట్టా­రు. ఉగ్ర కు­ట్ర­లో ఫరీ­దా­బా­ద్‌­లో­ని అల్‌-ఫలా యూ­ని­వ­ర్సి­టీ  సి­బ్బం­ది పా­త్ర ఉం­డ­డం, నిం­ది­తు­ల మరో కారు కూడా అక్క­డే లభ్యం కా­వ­డం­తో క్యాం­ప­స్‌­లో భద్రత కట్టు­ది­ట్టం చే­శా­రు.

Tags:    

Similar News