మరో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్

Update: 2020-04-22 08:19 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి ఇమ్మిగ్రేషన్‌ను 60 రోజులు నిలిపివేశారు, ఈ వివాదాస్పద చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడుతుందని అంటున్నారు. కొరోనావైరస్ మహమ్మారితో దేశం ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన ప్రస్తావించారు.

ఇమ్మిగ్రేషన్ను పాజ్ చేయడం ద్వారా, లాక్ డౌన్ అనంతరం నిరుద్యోగ అమెరికన్లను ఉద్యోగాల కోసం మొదటి స్థానంలో ఉంచడానికి ఇది సహాయపడుతుంది" అని ట్రంప్ మంగళవారం తన రోజువారీ మహమ్మారిపై సమీక్షా సమావేశంలో అన్నారు. ఇది 60 రోజుల వరకు అమలులో ఉంటుంది.. ఆ తరువాత ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఏదైనా పొడిగింపు లేదా మార్పులపై తాను నిర్ణయిస్తానని ట్రంప్ చెప్పారు.

Similar News