మీరు ఉల్లంఘిస్తే.. మేము వైదొలుగుతాం: చైనాకు ట్రంప్ వార్నింగ్

Update: 2020-04-22 15:01 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాకు మరోసారి హెచ్చరికలు జారీ చేసాడు. రెండేళ్ల పాటు చైనాకు, అమెరికాకు జరిగిన కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కరోనాను అడ్డం పెట్టుకొని చైనా నిబంధనలు ఉల్లంగించే ప్రయత్నం చేస్తే.. అమెరికా పూర్తిగా డీల్ నుంచి తప్పుకుంటుందని హెచ్చరించారు.

అమెరికా-చాలా మధ్య సుమారు రెండేళ్లు సుంకాల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకోవడంతో.. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా, చైనా చర్యలు వలన ప్రపంచ మార్కెట్ అతలాకుతలం అయ్యే ప్రమాదముందని పలు దేశాలు ఆవేదన చెందాయి కూడా. అయితే ఇరు దేశాలు చర్చించి.. ఆ వివాదానికి జనవరిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇందులో భాగంగా 200 బలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఆ డీల్ లో ఉన్న కొన్ని నిబంధనల ప్రకారం.. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే.. ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించవచ్చు.

ఈ నిబంధనను కారణంగా చూపించి డీల్ ని పునఃసమీక్షించాలని చైనా కోరే అవకాశముందని అమెరికా-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ కమిషన్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికకు సమాధానంగా ట్రంప్ ‘అదే గనుక జరిగితే..మేము ఆ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగుతాం. ఆ తరువాత నేను ఏం చేయాలో అదే చేస్తాను’ అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Similar News