మధ్యప్రదేశ్ లో ఒకేసారి 44 మంది డిశ్చార్జ్

Update: 2020-04-23 03:52 GMT

మధ్యప్రదేశ్ లో అత్యధికంగా ఒకేరోజు 44 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా నిన్న సాయంత్రం వివా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఇంటికి వెళ్లిన తరువాత కొన్ని రోజులు నిర్బంధంలో ఉండాలని వైద్యులు వీరికి సూచించారు. మహమ్మారి నుండి కోలుకునేలా చేసిన వైద్యులు, సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు బాధితులు. అలాగే కరోనా భారిన పడి విజయవంతంగా కోలుకున్న వీరికి పూలదండలు వేసి బాహ్యప్రపంచంలోకి ఆహ్వానించారు.

అంతకుముందు, ఈ ఆసుపత్రి నుండి ఇద్దరు ఐఎఎస్ అధికారులతో సహా మొత్తం 30 మంది శుక్రవారం తమ ఇళ్లకు వెళ్లారు. ఇక ఒకేసారి 44 మంది డిశ్చార్జ్ కావడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. వారందరితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు 1,587 ఉండగా.. ఇందులో 80 మంది మృతి చెందారు, 152మంది కోలుకున్నారు.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో 1,355 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Similar News