ఇండియాలో 'కోవిడ్-19' కి సంబంధించిన వస్తువుల ఎగుమతి, దిగుమతి ఇక్కడే..

Update: 2020-04-23 17:20 GMT

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కోవిడ్ -19 కి సంబంధించిన వైద్య వస్తువుల దిగుమతి మరియు ఎగుమతులకు కేంద్రంగా మార్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. విమానాశ్రయం యొక్క 3800 చదరపు మీటర్ల విస్తీర్ణం స్థలాన్ని ఇందుకోసం ఇవ్వబడిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే కరోనావైరస్ కు సంబంధించి కిట్లు, వైద్య సామాగ్రిని దిగుమతి చేసుకుంటోంది ప్రభుత్వం. ఇదిలావుంటే దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 21494 కు పెరిగింది.

గురువారం, రాజస్థాన్‌లో 33, పశ్చిమ బెంగాల్‌లో 33, కర్ణాటకలో 16, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, అస్సాంలో ఒక రోగి నివేదికలో పాజిటివ్ అని వచ్చింది. కాగా ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో మొత్తం 21393 కేసులు కరోనా సంక్రమణకు గురయ్యాయి. ఇందులో 4257 మందికి నయం కావడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే మొత్తం 681 మంది మరణించారు. ప్రస్తుతం 16454 మందికి చికిత్స కొనసాగుతోంది.

Similar News