KAVITHA: కొత్త రాజకీయ వేదిక వస్తుంది: కవిత

కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

Update: 2026-01-05 08:00 GMT

తెలంగాణ ప్రజల కోసం కొత్త రాజకీయ వేదిక రానుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామని, సమస్యలపై పోరాడతామని చెప్పారు. రాజకీయాల్లో మార్చు తెచ్చే వేదిక‌గా జాగృతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పార్టీలోకి అందరూ రావాలని ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మహిళల హక్కుల కోసం తనను దీవించాలని కోరారు. ఆడబిడ్డలకు రోషం చూపిద్దామని పిలుపునిచ్చారు.

"వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా.."

తనది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత అన్నారు. "దేవుడు మీద.. నా ఇద్దరి బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా.. ఒక్య వ్యక్తిగా సభ నుంచి వెళ్లిపోతున్నా.. ఒక శక్తిగా తిరిగివస్తా. KCRపై కక్షతో BJP నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా BRS నాకు అండగా నిలవలేదు. KCRకు అవినీతి మరక అంటితే నేనే పోరాడా.. నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు. BRS నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా." అన్నారు.

బీఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయమే

ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. బీఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి నిర్మాణం వరకు అవినీతే జరిగిందన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. ఉరి వేసే ఖైదిని చివరి కోరిక అడుగుతారని.. అలా కూడా తనను అడగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు.

రాజీనామా ఆమోదించండి

తన రా­జ­కీయ ప్ర­స్థా­నం గు­రిం­చి చె­బు­తూ ప్ర­సం­గం మధ్య­లో కం­ట­త­డి పె­ట్టా­రు. 8 ఏళ్లు­గా ప్ర­జల కోసం తాను చే­స్తు­న్న ప్ర­య­త్నా­న్ని అడ్డు­కు­న్నా­ర­న్నా­రు. పా­ర్టీ మౌ­త్‌ పీ­స్‌­గా ఉన్న ఛా­నె­ళ్లు, పే­ప­ర్లు తనకు ఏనా­డూ మద్ద­తు ఇవ్వ­లే­ద­న్నా­రు. తాను ప్ర­శ్ని­స్తే మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ వెంట ఉండే కొం­ద­రు వ్య­క్తు­లు కక్ష­గ­ట్టా­ర­ని చె­ప్పా­రు. బీ­ఆ­ర్ఎ­స్‌­లో మొ­ద­టి నుం­చి తనపై ఒత్తి­ళ్లు ఉన్నా­య­ని శా­స­న­మం­డ­లి­లో ఎమ్మె­ల్సీ కవిత భా­వో­ద్వేగ ప్ర­సం­గం చే­శా­రు. ఎమ్మె­ల్సీ పద­వి­కి రా­జీ­నా­మా­పై కవిత వి­వ­రణ ఇచ్చా­రు. శా­స­న­మం­డ­లి­లో కవిత మా­ట్లా­డు­తూ… ‘నా రా­జీ­నా­మా­ను ఆమో­దిం­చా­ల­ని కో­రు­తు­న్నా. తె­లం­గాణ జా­గృ­తి­ని స్థా­పిం­చి ఉద్య­మం­లో­కి వచ్చా­ను. బీ­ఆ­ర్ఎ­స్‌­లో చే­రిక ముం­దే జా­గృ­తి­ని స్థా­పిం­చా. తె­లం­గాణ కో­స­మే ఉద్య­మం­లో­కి వచ్చా. 8 ఏళ్లు­గా ప్ర­జల కోసం నేను చే­స్తు­న్న ప్ర­య­త్నా­న్ని అడ్డు­కు­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్‌­లో మొ­ద­టి నుం­చి నాపై ఒత్తి­ళ్లు ఉన్నా­యి. ప్ర­శ్ని­స్తే నాపై కక్ష కట్టా­రు కే­సీ­ఆ­ర్ వెంట ఉండే కొం­ద­రు వ్య­క్తు­లు. ప్ర­భు­త్వం­లో అవి­నీ­తి­ని ప్ర­శ్ని­స్తూ వచ్చా­ను. కలె­క్ట­రే­ట్లు కట్టిన రెం­డు నె­ల­ల­కే కూ­లా­యి. అమర దీపం ని­ర్మా­ణం­లో అవి­నీ­తి జరి­గిం­ది. నేను ప్ర­జల గు­రిం­చి, సమ­స్యల గు­రిం­చి చె­ప్పిన వి­ష­యా­ల­ను ఎవరూ పట్టిం­చు­కో­లే­దు’ అని అన్నా­రు. భా­వో­ద్వే­గా­లు మధ్య రా­జీ­నా­మా చే­య­డం సరైం­ది కా­ద­ని, రా­జీ­నా­మా అం­శం­లో పు­న­రా­లో­చన చే­యం­డ­ని ఎమ్మె­ల్సీ కవి­త­కు మం­డ­లి చై­ర్మ­న్ సు­ఖేం­ద­ర్ రె­డ్డి సూ­చిం­చా­రు.

Tags:    

Similar News