దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20 వేలు దాటాయి. ఇప్పటివరకూ 653 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 5 వేల 200 కేసులు నమోదు కాగా.. ఢిల్లీ , గుజరాత్ లో 2 వేలకు పైగా నమోదయ్యాయి. ఇక తెలంగాణలో 928 కి చేరారు కరోనా రోగులు.. అలాగే ఇక్కడ 23 మంది చనిపోయారు.
సూర్యాపేట జిల్లాలో 80 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు క్వారంటైన్ ను 28 రోజులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రైమరీ కాంటాక్ట్స్ కు మాత్రమే టెస్టులు చెయ్యాలని నిర్ణయించింది. సెకండరీ కాంటాక్ట్స్ కు స్టాంప్ వేసి 28 రోజుల పరిశీలనలో ఉంచనున్నారు.