లాక్‌డౌన్‌తో కరోనా నివారణలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి: కేంద్రం

Update: 2020-04-25 18:12 GMT

ఆర్థిక సమస్యలు ఉన్నా.. కరోనా నియంత్రణలో రాజీపడొద్దని అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి ఈ మేరకు ఆదేశించారు. లాక్‌డౌన్‌తో కరోనా నివారణలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని.. మే 3 వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగించాలని అన్నారు. విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అటు, వలస కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించామన్నారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్రాలకు సూచించామని రాజీవ్ గౌబ తెలిపారు.

Similar News