నేటినుంచి రంజాన్ మాసం‌.. ప్రారంభమైన ఉపవాసాలు

Update: 2020-04-25 01:45 GMT

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభమైంది. శుక్రవారం నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఆరంభమైనట్టు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. దీంతో శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచి ముస్లింలు రంజాన్ ఉప‌వాసాలు మొదలుపెట్టారు. నెల రోజుల పాటు నియమనిష్టలతో ఈ ఉపవాస దీక్షలు చేస్తారు. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇంట్లోనే నమాజు చేయాలని ముస్లింలకు పలువురు ఇమామ్‌లు సూచించారు.

ఇక రంజాన్ మాసం ప్రారంభ‌మైన సందర్బంగా ముస్లిం‌ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు చెప్పారు.. అంద‌రి క్షేమాన్ని కోరుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశారు. ప‌విత్ర‌మాసంలో అంద‌రికీ ద‌య‌, సామ‌ర‌స్యం, క‌రుణతో ఉండాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.

Similar News