ఇలా చేయగలిగితే.. కరోనా లేనట్లే: రాందేవ్

Update: 2020-04-25 18:10 GMT

ప్రాణాయామాలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని యోగా గురువులు చెబుతుంటారు. అలాగే కరోనా వైరస్ లక్షణాలు బయటపడకముందే.. ఒక నిమిషం పాటు ఊపిరి పీల్చుకుని ఆపగలిగిన వారికి కరోనా లేనట్లేనని యోగా గురువు బాబా రాందేవ్ అంటున్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉజ్జెయి ప్రాణాయామ ప్రక్రియ కరోనాను కట్టడి చేస్తుందన్నారు.

ఈ ప్రాణాయామం చేసే విధానాన్ని వివరిస్తూ.. ముక్కు ద్వారా గాలి బాగా పీల్చుకొని కాసేపు ఊపిరి బిగబట్టాలి. ఆ తరువాత నిదానంగా వదలాలి. యవ్వనంలో ఉన్నవారు ఒక నిమిషం పాటు గాలిని బంధించగలుగుతారని, అదే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైతే 30 సెకన్ల పాటు శ్వాసను ఆపగలుగుతారని అన్నారు. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే కోవిడ్ బారిన పడకుండా కూడా ఉండొచ్చని అన్నారు. అయితే ఈ ప్రాణాయామం చేసే ముందు ముక్కులో రెండు చుక్కలు ఆవ నూనె వేసుకుంటే అది వైరస్‌ని నాశనం చేస్తుందని రాందేవ్ తెలిపారు.

Similar News