కరోనాపై విజయం సాధించేవరకు మన ఇళ్లే మనకు మజిద్, గుడి, గురుద్వారా అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రార్థనలు ఇంటినుంచే చేయాలని ప్రజలను కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు దైర్యం చెప్పేందుకు గత నాలుగు రోజులుగా మమతా బెనర్జీ పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. శనివారం రెండు ప్రాంతాలలో పర్యటించిన మమత.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 100 మంది వరకు కరోనా బాధితులు కోలుకున్నారని, మిగిలిన వారు కూడా త్వరలో కోలుకోవాలని సీఎం మమత పేర్కొన్నారు.
అటు రంజాన్ సందర్భంగా సీఎం మమత బెనర్జీ ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటించాలనికోరారు.