అడవి బిడ్డలం.. ఆకులే మా మాస్కులు..

Update: 2020-04-27 17:03 GMT

మాకేముంటయ్ దొరా.. అడవుల్లో తిరగెటోళ్లం.. అడవితల్లినే నమ్ముకుని బతికెటోళ్లం.. అదేదో వైరస్ వచ్చిందని అందరూ మూతికి కట్టుకుంటన్నరు. మాగ్గూడ వస్తదేమో అని ఈ ఆకులు కట్టుకున్నం. అడవిలో దొరికే ఆకులే మాకు శ్ర్రీరామ రక్ష. ప్రపంచమంతటినీ కరోనా కలవరపెడుతున్న వేళ.. మాస్కుల గురించి, శానిటైజర్ల గురించి మాట్లాడుకుంటున్న వేళ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీకి చెందిన గిరిజనులు ఆకులనే మాస్కులుగా ధరించారు. అందర్నీ ఆలోచింపజేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

Similar News