కరోనా ఎఫెక్ట్: నీతి ఆయోగ్ భవనం మూసివేత

Update: 2020-04-28 15:04 GMT

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాకు రాజు, పేద తేడా లేదు. చాలా దేశాలల్లో ప్రముఖులకు కూడా ఈ మహమ్మారి వదిలి పెట్టలేదు. భారత్ లో తాజాగా ఢిల్లీలో నీతి ఆయోగ్ అధికారికి కరోనా సోకిందని నీతి ఆయోగ్ పరిపాలనా విభాగ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ తెలిపారు. దీంతో ఆ భవనాన్ని మూసివేశారు. రెండు రోజుల పాటు భవనాన్ని మూసి ఉంచుతామని.. పూర్తి స్థాయిలో శుభ్రం చేసాక.. తెరుస్తామని తెలిపారు. ప్రస్తుతం శానిటైజేషన్ పనులు కొనసాగుతున్నాయని అజిత్ కుమార్ తెలిపారు. కాగా.. సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి సెక్యూరిటీకి కూడా కరోనా సోకింది.

Similar News