హర్యానాలో కరోనా రోగుల సంఖ్య 306 కి చేరుకుంది. మంగళవారం కొత్త కేసులు రాలేదు. రాష్ట్రం మొత్తం 306 మంది రోగులలో 218 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అంటే 71 శాతం మంది రోగులు కోలుకున్నారన్నమాట. హర్యానాలో ప్రస్తుతం 85 క్రియాశీల కేసులు మాత్రమే ఉండగా, ముగ్గురు మరణించారు. మంగళవారం, ఫరీదాబాద్ , పంచకుల నుండి ఇద్దరేసి రోగులు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ కాగా, 1 రోగిని పాల్వాల్ నుండి కరోనాను జయించారు.
ఇదిలావుంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు ఇలా వున్నాయి. గుర్గావ్‌లో 51, ఫరీదాబాద్‌లో 46, పల్వాల్‌లో 34, పంచకులలో 19, సోనిపట్‌లో 22, అంబాలాలో 14, పానిపట్‌లో 13, జజ్జర్‌లో 5, కర్నాల్‌లో 6, రోహ్‌తక్, హిసార్ , సిర్సా లో నాలుగేసి కేసులు నమోదు కాగా.. యమునానగర్ , భివానీలలో మూడు, కైతాల్, జింద్ 2 కేసులు నమోదు అయ్యాయి.