కరోనాతో ఆర్దోపెడిక్ వైద్యుడు మృతి..

Update: 2020-04-28 17:26 GMT

కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ అహర్నిశలూ కష్టపడుతున్నారు వైద్యులు, వైద్య సిబ్బంది. వారికీ వైరస్ సోకి మరణిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో 60 ఏళ్ల ప్రముఖ ఆర్దోపెడిక్ వైద్యుడు బిప్లాట్ కాంతిదాస్ గుప్తాకు వైరస్ సోకి మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వైద్యుడు ఆయనే అని అధికారులు వెల్లడించారు. ఆయనకు అప్పటికే శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. అయినా తన కర్తవ్యాన్ని విడవకుండా రోగులకు సేవలందించి అదే వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ లక్షణాలతో సాల్ట్ లేక్ ఆస్పత్రిలో జాయిన్ చేసేనాటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

Similar News