కరోనా ఎఫెక్ట్.. బావుందండి.. చైనా బడి

Update: 2020-04-27 18:48 GMT

కరోనా వైరస్ పాత పద్దతులకు స్వస్తి చెప్పి కొత్త పద్దతులకు అంకురార్పణ చేస్తోంది. కోవిడ్ కారణంగా మూత పడ్డ పాఠశాలలన్నీ తెరుచుకుంటున్నాయి చైనాలో. వూహాన్ నగరంలోని హాంగ్‌ఝౌ సిటీలోని ఓ స్కూలు పిల్లలు సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని స్కూలు యాజమాన్యం రూల్ పెట్టింది. దాంతో బడికి వచ్చిన పిల్లలందరూ తలపై అట్టముక్కలు, బెలూన్ల లాంటివి పెట్టుకుని వస్తున్నారు.

వైరస్ మాకెన్నో మంచి పాఠాలు నేర్పింది అంటూ పిల్లలంతా బుద్దిగా మాస్కులు పెట్టుకుని స్కూల్‌కి వస్తున్నారు. అరగంటకి ఒక సారి చేతుల్ని శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటున్నారు. పాఠశాలలో ఉన్న వాష్ రూమ్‌లను శుభ్రంగా వుంచుతున్నారు. క్యాంటిన్లవైపు కన్నెత్తైనా చూడకుండా అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్‌ని చక్కగా తినేస్తున్నారు. పిల్లలు పెట్టుకున్న ఈ హెడ్జర్లను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Similar News