లాక్ డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను
సొంత గ్రామాలకు చేర్చడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హోం శాఖ
సహాయమంత్రి కిషన రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ కృషి చేశారని.. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నాయకులు మత్స్యకారుల గురించి తనకు తెలిపిన వెంటనే ట్విటర్ ద్వారా చేసిన విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
తన ట్వీట్ కు తక్షణం స్పందించి మత్స్యకారులకు కావలసిన ఆహార పదార్థాలను అందించిన గుజరాత్ ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పవన్ అన్నారు. 36 బస్సులలో సుమారు 3800 మంది గుజరాత్ లోని వెరావల్ తీర ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరారని తెలిసి చాలా సంతోషం అనిపించిందని పవన్ అన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపారని అన్నారు.