దేశంలో ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య అలానే పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే కొందరు యువకులు.. దొరికిందే సందు అనుకోని రెచ్చిపోతున్నారు. కరోనా కట్టడి చేయడానకి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు. పల్లెల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
తంజావురు జిల్లాలోని కంబిస్థలంలో కొందరు యువకులు లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నారు. ఇలా ఉన్నవారు ఉండకుండా ఒక తోటలో కూర్చుని పార్టీ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కరోనా భోజనం పేరుతో 10 మంది యువకులు కలసి అరిటాకులో భోజనం చేస్తూ సరదాగా గడిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. 10 మంది యువకులను అరెస్ట్ చేశారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతిఒక్కరూ లాక్‌డౌన్ నిమయాలు పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.