ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఒక్కరోజులోనే 71 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 31,787కు చేరింది. ప్రస్తుతం 22,982 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1,008 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.