బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుముశారు. ఇర్ఫాన్‌ఖాన్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వెర్సోవా కబ్రిస్తాన్లో ఇర్ఫాన్‌ఖాన్ పార్థీవదేహాన్ని ఖననం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు, ఐదుగురు స్నేహితులు పాల్గొన్నారు. అటు ఇర్ఫాన్ మృతికి దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.