పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మార్చి 23 న ఆకస్మికంగా ముగిసింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలైలో జరగనున్నాయి. ఈ క్రమంలో గ్రౌండ్ రియాలిటీని బట్టి పార్లమెంటు తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం అన్నారు. ఆయన రాజ్యసభ సభ్యులు, పార్టీ నాయకులతో సంభాషించారు. ‘మిషన్ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు.
కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో మంచి ఫలితాలు వస్తే షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని వెంకయ్యనాయుడు అన్నారు. కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఉపరాష్ట్రపతి 245 రాజ్యసభ సభ్యులలో 241 మందితో మాట్లాడారు.