పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్ధులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడపడం కుదరదని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది. వలస కార్మికులను, విద్యార్ధులను తరలించేందుకు బస్సులను మాత్రమే వినియోగించాలని.. ఈ క్లిష్ట సమయంలో ప్రత్యేక రైళ్లు కేటాయించలేమని కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేసింది.
వలస కార్మికులను ఆయా రాష్ట్రాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకొని తరలించుకోవచ్చని.. రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర సహా కొన్ని దక్షిణాది రాష్ట్రాలు సైతం వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నడపాలంటూ కేంద్రాన్ని కోరాయి. దీంతో కేంద్రం ఈ మేరకు స్పష్టం చేసింది.