ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభంకానున్నాయి. ‘సమగ్ర అభ్యసన సామర్థ్యాల పెంపుదల’ పేరిట ఇప్పటికే మొదట విడత పూర్తవ్వగా.. రెండు విడత 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నెల 4 నుంచి 22 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ శిక్షణా తరగతులు వెబ్‌నార్, అభ్యసన యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టీచర్లకు శిక్షణ ఇప్పించనుంది. ఆరో తరగతి వరకూ ఇంగ్లిష్ బోధిస్తున్న వారందరూ కచ్చితంగా హాజరు కావాల్సి ఉండగా.. ఇతర ఉపాధ్యాయులకు కూడా ఆసక్తిగల ఉంటె.. హాజరయ్యే అవకాశం కల్పించారు.