కరోనా వ్యాప్తికి కారణమని భావిస్తున్న ఢిల్లీ మర్కజ్ భవన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు దాదాపు 16,500 మంది పాల్గొని ఉంటారని ఓ నివేదిక వెల్లడైంది. అక్కడికి వెళ్లిన వారిని ప్రత్యక్షంగా కలిసిన అధికారి ఒకరు ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించారు. ఇంకా వీరికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులను రంగంలోకి దించారు. సమావేశాలకు వెళ్లి వచ్చిన అనంతరం ఎవరెవరిని కలుసుకున్నారు.. ఎవరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనే విషయాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం సాయుధ బలగాలను కూడా సమాయత్తం చేశారు.