బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ

Update: 2020-05-03 05:35 GMT

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ అధిపతులతో ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టిన వివిధ చర్యల అమలు తీరుపై మాట్లాడారు. ఈ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల ఎండీలు, సీఈఓలు పాల్గొన్నారని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్న బ్యాంకులను ఆర్‌బీఐ గవర్నరు ప్రశంసించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ అస్తిరత్వంపై.. మళ్లీ స్థిరంగా కొనసాగాలి అంటే ఏలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.

Similar News