దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబుల బాధలు వర్ణనాతీతం. ఇప్పుడు ఈ అవసరాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే కొందరు కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. తాజాగా అక్రమంగా వైన్ తయారు చేస్తున్న తండ్రీ కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఉత్తర చెన్నైలోని కొడుంగయ్యూర్‌కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి 26 ఏళ్ల తన కుమారుడితోపాటు మరో యువకుడితో కలిసి అక్రమంగా గ్రేప్ వైన్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో రైడింగ్ చేసి నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 లీటర్ల గ్రేప్ వైన్‌ను, మరో 5 లీటర్ల సుంద కంజీ స్వాధీనం చేసుకున్నారు. కాగా, తమిళనాడులో మార్చి 24 నుంచి అక్రమ లిక్కర్ తయారీ కేంద్రాలపై పోలీసుల రైడింగ్‌లు కొనసాగుతున్నాయి.