జూన్ నుంచి బొమ్మ పడుద్ది

Update: 2020-05-05 20:46 GMT

లాక్డౌన్ కారణంగా దాదాపు అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా పరిశ్రమ, వేల మంది కార్మికులు ఇండస్ట్రీపై ఆధారపడి బ్రతుకుతున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి నిర్మించిన చిత్రాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ అవకుండా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా చిత్ర నిర్మాణం చేపట్టాలని ఇండస్ట్రీకి చెందిన పలువురు తలసానిని కలిసి లేఖ అందజేశారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని లాక్డౌన్ అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ది గురించి చిరంజీవి, నాగార్జునలతో చర్చించామన్నారు.

Similar News