వావ్.. ఆకాశంలో అద్భుతం.. అస్సలు మిస్సవ్వొద్దు

Update: 2020-05-06 15:30 GMT

నీలి ఆకాశంలో అందమైన చందమామ, మిణుకు మిణుకుమనే నక్షత్రాలు ఎప్పుడూ అద్భుతమే. వెన్నెల పిండారబోసినట్లు ఉండే పౌర్ణమి చంద్రుడు ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే ఈ నెల 7నుంచి వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఇది 2020 చివరి సూపర్‌మూన్ కాబట్టి. ఆ రోజు కనిపించే ఈ చందమామకు ప్లవర్‌మూన్ అని మరో పేరు కూడా ఉంది. కక్ష్యలో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. దాంతో చంద్రుని పరిమాణం పెద్దగా కనిపిస్తుంది.

నాసా ప్రకారం.. సూపర్ ప్లవర్ మూన్ మే 7 ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్‌టి) సాయింత్రం గం.4.15ని.లకు చంద్రుడు ఆకాశంలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మే నెలలో వచ్చే పౌర్ణమిని ప్లవర్ మూన్ అని కూడా అంటారు. దాంతో రెండింటినీ కలిపి సూపర్ ప్లవర్ మూన్ అని పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్లవర్ మూన్ ఉత్తారార్థగోళంలో వైల్డ్ ప్లవర్స్ వికసించే సంవత్సరాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా పువ్వులు చెట్లనిండా వికసించినప్పుడు ఈ చంద్రుడు సంభవిస్తాడు. ప్లవర్ మూన్ అనెమోన్, ఇండిగో, బ్లూబెల్స్, సన్‌డ్రాప్స్, వైలెట్స్ వంటి వైల్డ్ ప్లవర్స్ వికసించడంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆపేరుతో కూడా పిలుస్తుంటారు.

Similar News