ఔరంగాబాద్‌లోని రైలు ప్రమాద ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. బడ్నాపూర్, కర్మద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదం జరిగిందని వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వివరించింది.
ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలను గమనించిన లోకో పైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించాడని.. అయితే ఆ ప్రయత్నం విఫలం అయిందని రైల్వే శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పర్బాని-మన్మాడ్ సెక్షన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. క్షతగాత్రులను ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.