విశాఖ గ్యాస్ ఘటన చాలా బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గ్యాస్ లీక్ దుర్ఘటన మానవ తప్పిదమా.. లేదా సాంకేతిక తప్పిదమా తేల్చాలన్నారు. కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ ప్రకటన చాలా క్యాజువల్ తీసుకున్న నిర్ణయంలా ఉందన్నారు. ముఖ్యమంత్రికి అవగాహనారాహిత్యం వల్ల ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకున్నారన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని బాబు ప్రశ్నించారు. సమస్య లోతులోకి వెళ్లకుండా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నిపుణులు, శాస్త్రవేత్తలు విశాఖ వచ్చి అధ్యయనం చేయాలన్నారు. భవిష్యత్తలో ఎలాంటి పరిణామాలుంటాయో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమను తక్షణమే మూసివేసి అక్కడి నుంచి తరించాలన్నారు. లాక్‌డౌన్ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ అధ్యయనం చేయాలన్నారు చంద్రబాబు.